బంగారం ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు భారీగా పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయ్. అలాంటి బంగారం ధరలు ఈరోజు ఏకంగా భారీగా క్షిణించాయి. 

 

ఎంత పతనమయ్యాయో తెలిస్తే మీరు కూడా వావ్ అనకుండా ఉండలేరు... అంత భారీగా పతనమయ్యాయి. వారం రోజుల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. అసలు బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే?.. నేడు బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 920 రూపాయిల తగ్గుదలతో 42,300 రూపాయిలు చేరగా.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 920 రూపాయిల తగ్గుదలతో 38,700 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా 6,280 రూపాయిల తగ్గుదలతో 41,780 రూపాయలకు చేరింది. కనివిని ఎరుగని రీతిలో బంగారం ధరలు క్షిణించాయి అంటే నమ్మండి. వెండి ధర ఇంత తగ్గటం రికార్డు అనే చెప్పాలి. మరి ఈ బంగారం ధరలు ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: