కరోనా వైరస్ ఏమో కానీ.. మనిషి విలువను పెంచేసింది.. పర్యావరణ విలువ పెంచింది.. కాలుష్యం తగ్గించింది... కొంతమందిని ప్రజలను తీసుకెళ్లినప్పటికీ కొంచం మంచి చేసింది.. బంధుత్వాలను కలిపింది.. గ్రీనరీని పెంచింది.. అలానే బంగారం ధర కూడా పెంచింది.. ఏంటి? ఎందుకు అని అనుకోవచ్చు.. 

 

కానీ నిజం చెప్పాలి అంటే కరోనా వైరస్ ప్రభావం బంగారంపై బాగా ఎఫెక్ట్ చూపించింది.. ఎంత ఎఫెక్ట్ చూపించింది అంటే? గతంలో 38 వేలు ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 6 వేలు పెరిగి 44 వేలు అయ్యింది. ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందులో ఏలాంటి సందేహం లేదు.. అయితే నిన్నటికి నిన్న రెండు వేలు పెరిగిన బంగారం ధర.. 

 

ఈరోజు మళ్లీ పెరిగింది. నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయ్.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 46,910 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 44,750 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం గమణియంగా తగ్గాయి.. దీంతో నేడు కేజీ వెండి ధర 300 రూపాయిల తగ్గుదలతో 41,840 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ కొనే పరిస్థితి లేకపోయింది.. ఎందుకంటే కరోనా నియంత్రణకై లాక్ డౌన్ ఉంది కనుక.                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: