బంగారం ధర ఎంత దారుణంగా తగ్గిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు తగ్గుతూ వస్తున్న ఈ బంగారం ధర ఇంత తగ్గటానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ ఏ కారణం అని.. అక్కడ బంగారం ధర భారీ తగ్గుదల కారణంగా ఇప్పుడు మన దేశ మార్కెట్ లో బంగారం ధర భారీగా తగ్గింది మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అయితే ఈ బంగారం ధర కూడా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి అనుకుంటే భారీగా పెరిగింది. కేవలం అంటే కేవలం ఒక సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 16 వేల రూపాయిలు పెరిగింది. ఇప్పటికి బంగారం ధర పెరుగుతూనే వస్తుంది. అయితే ఏమైందో తెలియదు కానీ గత వారం రోజుల నుండి బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తుంది.

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,120 రూపాయిల తగ్గుదలతో 47,230 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,130 రూపాయిల తగ్గుదలతో 44,270 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధరలు అన్ని భారీగా తగ్గాయి. 

 

ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 80 రూపాయిల తగ్గుదలతో 47,320 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు వద్ద బంగారం ధరలు తగ్గుతూ కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ బంగారం ధరలు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: