నిన్నటికి నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లి స్వల్పంగా పెరిగాయి.. వారం రోజులు పెరిగితే రెండు రోజులు బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే నిజానికి ఈ రెండు రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ మరుసటి రోజు బంగారం ధర అంతే రెట్టింపు పెరుగుతుంది. ఇంకా ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి. 

 

కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడటం.. అవి దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇలా రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇంకా ఇప్పటికే కేవలం ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 16 వేలు పెరిగింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బంగారం, వెండి ధర ఇలా కొనసాగుతుంది.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయ్. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 49,660 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 45,530 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 47,710 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.      

మరింత సమాచారం తెలుసుకోండి: