బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి.. బంగారంను ఇకపై సామాన్యులు కొనలేరు. అలాంటి రేంజ్ కు బంగారం ధరలు చేరాయి. అయితే అంత ధర ఎలా పెరిగాయి అని అనుకుంటున్నారా? అదేనండి .. ఈ కరోనా వైరస్ ఎఫక్ట్ ఏ కారణం. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణం లాక్ డౌనే. 

 

అయితే బంగారం ధరలు ఇలా దారుణంగా పెరగడానికి కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధర డిమాండ్ భారీగా పెరిగింది అని అందుకే బంగారం ధరలు పెరిగాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు బంగారం ధర పెరిగినప్పటికీ లాక్ డౌన్ లో స్టాక్ మార్కెట్ దారుణంగా కుప్పకూలిపోవడం.. ఇన్వెస్టర్లు అంత బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడం వల్లే బంగారం ధరలు పెరిగాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అయితే నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిల పెరుగుదలతో 49,670 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 210 రూపాయిల పెరుగుదలతో 45,530 రూపాయలకు చేరింది.

 

ఇంకా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 600 రూపాయిల పెరుగుదలతో 47,700 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతుంది. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: