శనగలు ఒక బలమైన ఆహారము. పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శ‌నగలు ఒకటి. ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శ‌నగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. శెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొలకల రూపంలో తీసుకున్నా, ఉడికించి తీసుకున్నా మంచిదే. అందుకే వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.


ముఖ్యంగా చాలా మంది పెళ్ళైన జంటలు ఈ మధ్యకాలంలో గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇలాంటి సమస్యలు తలెత్తడానికి 40% సందర్భాల్లో పురుషులే ప్రధాన కారణం అని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే శ‌న‌గ‌ల‌ను ఆహారంలో చేర్చుకుంటే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అదే విధంగా సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత ఒకటి, శ‌నగల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.


శ‌నగలను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల శరీరానికి కావాల్సి న ప్రోటీన్‌‌, ఫైబర్ అందుతాయి. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. మధుమేహం ఉన్న వారికి శెనగలు శ్రేయస్కరం. ఇవి రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపు చేస్తాయి. వీటిల్లోని పీచు పదార్థం.. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. శ‌నగల్ని నిత్యం తీసుకుంటే గుండెకు రక్తం సరఫరా మెరుగ్గా జరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు గుండెకు బలాన్ని ఇస్తాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: