వాస్తవానికి ఇప్పటి మనిషికి అన్నివిధాలుగా సుఖవంతంగా జీవించేందుకు రకరకాల సౌకర్యాలు, ఉపకరణాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటివలన మనిషి ఎంతో బద్దకస్తుడిగా మారుతూ తన శరీరాన్ని ఏ మాత్రం శ్రమ పెట్టకుండా వ్యాధుల పాలు చేసుకుంటున్నాడు. అలానే కల్తీ ఆహారం, ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ద్వారా కాలం గడిచే కొద్దీ మనిషి తన జీవన ప్రమాణ రేటుని కూడా తగ్గించుకుంటున్నాడు అనేది మర్చిపోకూడదు. అయితే అవి మాత్రమే కాక రోజువారీ మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లే మన ప్రాణాలు ఎలా హరిస్తున్నాయి అనడానికి ఇటీవల కొందరు శాస్త్రవేత్తల బృందం వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టడం జరిగింది. అవేమిటంటే, మనం పలు వ్యాధులకు గురవడానికి ముఖ్యంగా మన శరీరంలోకి  చేరే రకరకాల క్రిములేనని అంటున్నారు. 

ఇక వారు చెప్తున్న దానిని బట్టి, నిత్యం మనం తినే కూరగాయలను సాధారణ నీళ్లతో కడిగే బదులు, వాటిని ఒక గిన్నెలో కొంత ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసిన తరువాత కోసి, కూర వండుకుంటే మంచిదట. ఇక కొంతమంది పచ్చి గుడ్డు సొనను తాగుతుంటారని, వాస్తవానికి అది ఆరోగ్యానికి మంచి చేసినప్పటికీ, అలా తాగడం ద్వారా అందులోని కొన్ని అతి సూక్ష్మమైన క్రిములు మన జీర్ణవ్యవస్థలోకి చేరి, పలు రకాల సమస్యలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉందట. ఇక నాన్ వెజ్ వండేటప్పుడు ఎంతో పరిశుభ్రత పాటించి వండాలని, అలానే అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగుతుంటారని, ఆ అలవాటుని ఎంతత్వరగా మానేస్తే అంత బెటరని కూడా చెప్తున్నారు. 

ఎందుకంటే సాధారణంగా మన ఇంట్లోని నీటిని తాగుతుంటేనే మన పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, అటువంటిది బయట ఎక్కడపడితే అక్కడ నీరు తాగితే వాటిలోని క్రిముల వలన ముఖ్యంగా అతిసార వంటి వ్యాధులు ప్రభలడంతో పాటు, కాలేయం, కిడ్నీల వంటివాటికి ముప్పని అంటున్నారు. వాటితో పాటు మొబైల్, ల్యాప్టాప్ వంటివి వాడిన తరువాత తప్పనిసరిగా మన చేతులు శుభ్రం చేసుకుని ఆహారం తీసుకుంటే మంచిదట. అలానే పెంపుడు జంతువులను పెంచుకునే వారు అయితే మరింత ఎక్కువగా ఎప్పటికపుడు చేతులు కడుక్కోవడంతో పాటు, వాటిని కూడా తరచు శుభ్రం చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఈ అతి చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే మనకు వ్యాధులు ప్రబలే అవకాశం తక్కువని వారు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇవి తప్పనిసరిగా పాటించి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: