ఆధునిక జీవనంలో ప్రధాన భాగమైపోయిన పిజ్జాలు, బర్గర్ల నుంచి, సూప్స్, కూల్ డ్రింక్స్ దాకా అన్నీ ప్రాణాల్ని హరింపచేసేవే తప్ప వీటిల్లో ఏ ఒక్కటికి కూడా ప్రాణాల్ని నిలబెట్టే శక్తి లేదు. అయితే మనిషిలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవశక్తిని పదింతలు చేయడంలో గోధుమ గడ్డి రసం ఎంతో ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు కూడా గోధుమ గ‌డ్డి రసాన్ని వినియోగించటం కనిపిస్తోంది. మధుమేహులు రోజూ ఈ రసాన్ని సేవిస్తే అదుపుతప్పిన మధుమేహం దారికొస్తుంది.

 

అలాగే ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసు లోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది. 

 

అలాగే శరీరంలోని హానికారక బాక్టీరియాను తొలగించి రోగాలు రాకుండా నివారిస్తుంది. ఇది మంచి చర్మ రోగ నివారిణి. ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: