ఉదయం నిద్ర లేవ‌గానే  వేడి వేడిగా టీ గొంతులో పడకపోతే ఎం తోచదు. ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. ఒకరోజు టీ తాగకపోతే ఎదో కోల్పోయిన వ్యక్తిలా నీరసంగా ఉండేవాళ్లు చాలామందే ఉన్నారంట..! టీ మన లైఫ్‌లో ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.. టీ తాగ‌డం వ‌ల్ల ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.. అలాగే మానిసిక ఒత్తిడి  నుంచి రిలీప్ వ‌స్తుంది.. అయితే చాలా మంది అనేక రకాల టీలు తాగుతుంటారు.

 

అందులో కొంబుచా టీ కూడా ఒకటి.. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచే ఈ టీని అనేక దేశాల్లోని పలు వర్గాలకు చెందిన ప్రజలు సేవిస్తున్నారు.. అయితే ఇప్పుడిప్పుడే పలు ఇతర దేశాలకూ ఈ టీ రుచి తెలిసింది.. అందుకే ఈ టీని తాగేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ కొంబుచా టీని రోజు తాగడం వల్ల చాల మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కొంబుచా టీ తాగటం వల్ల చాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

 

ఈ టీలో ఉండే ప్రొ బయోటిక్స్.. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి.. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి.. అలాగే కొంబుచా టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు రాకుండా చూస్తాయి... ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. కొంబుచా టీని రోజు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: