ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న, పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ చెక్ పెట్టాలంటే కాకరకాయ రంగంలోకి దిగాల్సిందే. 

 

ఇంకా విషయానికి వస్తే.. నిజమే కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ ఈ కాకరకాయ ఎన్నో లాభాలను అందిస్తుంది. ఈ కాకరకాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టచ్చు. అయితే ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ను నివారించవచ్చు అని ఒక అధ్యయనంలో ప్రచురించబడింది. 

 

కాకరకాయ చేదుగా ఉండటం వల్ల దాని ప్రయోజనాలు, లాభాలు ఎన్ని ఉన్నాసరే దాని గురించి పట్టించుకోరు. 

 

అయితే కాకరకాయతో చేసిన జ్యూస్ డయాబెటిస్ వారికి ఇతర కూరగాయలు, పండ్ల వల్ల పొందే ప్రయోజనాల కంటే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. 

 

అయితే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి అందులో దోసకాయ కలుపుకుంటే ఎంత బాగుంటుంది అనేది .. అసలు ఆ జ్యూస్ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కాకరకాయ, దోసకాయ రసం ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

కావలసిన పదార్ధాలు.. 

 

2 పెద్ద కాకరకాయలు, 


ఒక మీడియం దోసకాయ,


1/2 నిమ్మ పండు, 


1 గ్రీన్ ఆపిల్,  


1/2 స్పూన్ ఉప్పు.  

 

తయారుచేయు విధానం... 

 

కాకరకాయను నీటితో బాగా కడిగి ఆ తర్వాత పైన తొక్కను ఓ మోస్తరుగా తొలగించాలి. కాకరకాయను సగానికి పొడవుగా కట్ చేసి, లోపల విత్తనాలను బయటకు తీసి వేయండి. తర్వాత కాకరకాయను చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో నీరు తీసుకొని తరిగిన కాకరకాయ ముక్కలను అందులో వేసి 10 నిమిషాలు నానబెట్టండి. అవసరమైతే ఆ నీటిలో కొంచెం ఉప్పు కూడా వేయవచ్చు. దోసకాయకు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ లో కాకరకాయ, గ్రీన్ ఆపిల్, మరియు కీరదోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్ కు 1/2 నిమ్మరసం కలపాలి. ఈ రసంను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాగడం వల్ల రక్తంలో డయాబెటిస్ శాతం అదుపులో ఉంచుకోవచ్చు. చూశారుగా ఈ చిట్కాను ఉపయోగించి మీ డయాబెటిస్ ని కంట్రోల్ లో పెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: