సాధార‌ణంగా మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. మామిడి పండు రుచిలో రారాజుగా ఉన్న‌ట్టుగానే అందులో ఉండే పోష‌కాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే మామిడి పండ్లు మాత్ర‌మే కాదు మామిడి ఆకుల‌తో కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వాటిని ప‌లు అనారోగ్యాలు తొల‌గించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు. మామిడి ఆకుల్లో న్యూట్రీషియన్ వ్యాల్యూస్ అధికమట. మామిడి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ తో పాటు కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫెవోనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ ఫెవనాయిడ్స్ , యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ ఇలా ఎన్నో న్యూట్రీసియన్స్ ఉన్నాయి.

 

మామిడి ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇంచుమించుగా మామిడి ఆకులు మరిగిన నీళ్ళు గ్రీన్ టీ లానే పనిచేస్తూ బాడిలోంచి టాక్సిన్స్ తొలగిస్తుంది. మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల ఏళ్ళుగా, మన ఇంటి తలుపుల ముందు మామిడి తోరణాలు ఉండటం సంప్రదాయంగా వస్తోంది.  బీపీని నియంత్రించ‌డంలో మామిడి ఆకులు అద్భుతంగా ప‌ని చేస్తాయి. కొన్ని మామిడి ఆకులు తీసుకుని నీటిలో వేసి మ‌రిగించి టీ డికాష‌న్‌గా త‌యారు చేసుకోవాలి. అనంత‌రం ఆ టీని తాగితే బీపీ త‌గ్గుతుంది.

 

రోజు రాత్రి మామిడి ఆకులు మరిగిన నీటిని తాగితే, కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు. మానసిక ఒత్తిడి, అజీర్ణం వంటి మిగితా సమస్యలపై కూడా మామిడి ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చెవి నొప్పికి కూడా మామిడి ఆకుల టీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆ టీని వేడిగా ఉన్న‌ప్పుడే ఒక‌టి, రెండు చుక్క‌లు నొప్పి ఉన్న చెవిలో వేయాలి. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. నోటి దుర్వాసన, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలకు మామిడి ఆకుల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: