పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. పిల్లలు తమ వయసుకు తగ్గట్లుగా ఎదగాలన్నా, రోగ నిరోధక శక్తి వారిలో పెంపొందాలన్నా, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉండాలన్నా వారు తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లలు ఆటలపై ధ్యాసతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశముంది. ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి వైద్యులు సూచిస్తున్నారు.  ప్రతిరోజూ తాజా పళ్లు, కూరగాయలు పెద్దఎత్తున ఆహారంలో భాగం చెయ్యాలి. పిల్లల పళ్లెంలో సగభాగం పళ్లు, కాయగూరలు ఉండేలా చూడాలి. 

 

అయితే ఆరోగ్యాని పండ్లు మంచివే అయిన‌ప్ప‌టికీ.. పిల్లలకు కొన్ని రకాల పండ్లు కలిపి పెట్టనే కూడదు. షోషకాహార లోపాలు సరిచేసుకోవడానికి పళ్ళు మంచి ప్రత్యామ్నాయం. అయితే సిట్రస్ జాతి పళ్ళు కలిపి తినేటప్పుడు జాగ్రత్త వ‌హించాలి. మ‌రి ఏ ఏ పండ్లు క‌లిపి పిల్ల‌ల‌కు పెట్ట‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ, ఎండు ద్రాక్ష‌ల‌ను క‌లిపి పిల్ల‌ల‌కు పెట్ట‌కూడ‌దు. రక్త వృద్ధికి ఎంతో సహాయపడే ఈరెండు పళ్ళు కలిపి తింటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

 

జామపండు మ‌రియు అరటిపండు క‌లిపి పిల్ల‌ల‌తో తిన‌పించ‌కూడ‌దు. ఎంతో విరివి గా దొరికే ఈ రెండు పండ్లు కలిపి తింటే కడుపునొప్పి వ‌స్తుంది. అయితే విడివిడిగా వీటిని తింటే వ‌చ్చే ఆరోగ్యం అంతా.. ఇంతా.. కాదు. అదే విధంగా కమలా పండు, పాలు క‌లిపి ఎప్పుడూ కూడా పిల్ల‌ల‌కు ఇవ్వ‌కూడ‌దు. పరస్పర విరుద్ధ లక్షణాలున్న ఈ రెండింటినీ కలిపి తీసుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు కడుపునొప్పి వస్తుంది. కమలా పండు మ‌రియు క్యారెట్ క‌లిపి తీసుకోకూడ‌దు. ఈ రెండిటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కడుపు మంట ఎసిడిటీ  వ‌స్తుంది. సో.. బీకేర్ ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: