ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చెయ్యాలంటే ఈ చిట్కాలు పాటించండి. 

                  

డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ అన్నం ఎక్కువగా తినకూడదు.. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.. ఇలా అన్ని రకాల సహజ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే అన్నం బదులు సద్దిరొట్టి తింటే డయాబెటిస్ మాయం అవుతుంది. 

                            

సద్ది రొట్టె తినేందుకు సాధార‌ణంగా ఎవ‌రూ ఇష్టప‌డ‌రు. అయితే సద్దిరొత్తితో ఎన్నో ప్రయోజ‌నాలు ఉన్నాయి. పాల‌తో పాటు స‌ద్ది రొట్టెను తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఒక్క డయాబెటిస్ ఏ కాదు రోజూ ఈ విధంగా స‌ద్దిరొట్టెను తినడం వల్ల బీపీ కూడా నియంత్రణ‌లో ఉంటుందట. 

                                 

అయితే ఇలా రెండు వ్యాధులు నియంత్రణకు రావడానికి కారణం రొట్టె త‌యారుచేసిన ఒక‌టి, రెండు రోజుల త‌ర్వాత దానిలో ప్రయోజ‌నం చేకూర్చే బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో పాటు దానిలోని గ్లూకోజ్ శాతం భారీగా త‌గ్గుతుంది. ఇటువంటి రొట్టెను పాల‌తో తీసుకోవ‌డం వల్ల ఉద‌ర సంబంధిత వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే మల‌బ‌ద్దకం లాంటి స‌మ‌స్యలు కూడా తీరిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: