సాధార‌ణంగా మనము థియేటర్లలో లేదా ఇంటి దగ్గర సినిమాలను చూసేటప్పుడు మనము ఎక్కువగా తీసుకునే స్నాక్స్ పాప్-కార్న్. ఇక  పాప్‌కార్న్‌ అంటే ఇష్టపడని వారుండరు. ప్రతిరోజూ వీటి కొద్దిగా తినడం వల్ల ఆరోగ్యానికి మెరుగైన లాభాలు చేకూరినట్లే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ప్రపంచవ్యాప్తంగా పజలందరూ పాప్కార్న్ ను సంతోషంతో ఆస్వాదిస్తున్నారు. పాప్‌కార్న్‌లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసుకున్న పాప్‌కార్న్‌ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. పాప్‌కార్న్ తినడం వల్ల అధికంగా క్యాలరీలు చేరతాయనే భయం ఉండదు. 

 

బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కని ఆహారంగా ఉపయోగపడతాయి. తక్కువ పాప్‌కార్న్ తిన్నా చాలా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు. పాప్‌కార్న్‌లో విటమిన్స్‌, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలు ఎముకలు దృఢంగా ఉండటానికి దోహదపడతాయి. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో పాప్‌కార్న్‌ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

 

అల‌లాగే పాప్‌కార్న్‌లో ఉండే ప్రోటీన్ మనకు శక్తినిస్తుంది. రోజంతా శక్తితో, ఉత్సాహంగా ఉండాలంటే పాప్‌కార్న్ తినాల్సిందే. పాప్‌కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. షుగర్‌, ఇన్సులిన్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. పాప్ కార్న్ అనేది ప్రాసెస్ చేయబడని, 100 శాతం సహజసిద్ధమైన తృణధాన్యముగా చెప్పవచ్చు. మన రోజువారీ సేవలను అందించేందుకు గానూ పాప్కార్న్ ను 70 శాతం కంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది.  పాప్‌కార్న్‌ను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: