డయాబెటిస్.. భారత్ లో రోజు రోజుకు డయాబెటిస్ వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ డయాబెటిస్ వల్ల ప్రాణానికి ఏ ముప్పు లేకపోయినప్పటికీ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ కంట్రోల్ అవ్వవాలంటే చాలా కష్టం. అలాంటి ఈ డయాబెటిస్ ఉన్నవారు శరీరంలోని అన్ని భాగాలూ జాగ్రత్తగా చూసుకోవాలి. 

                                               

ఎందుకంటే.. మధుమేహం శరీరంలోని ఏ భాగాన్నీ వదిలిపెట్టదు. కాకపోతే, అన్నింటికన్నా సున్నితమైనవి కళ్లు కాబట్టి, వాటి విషయంలో మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు అన్ని ఇక్కడ చదివి తెలుసుకోండి. అతి సాధారణమైనది, అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తంలోని షుగర్‌ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడం.

                            

డయాబెటిస్ దగ్గరే ఆగిపోకుండా, దానితోపాటే ఉండే అధిక రక్తపోటు, డిస్‌లిపిడేమియా, అనీమియా, ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా వంటి ఇతర వ్యాధుల నియంత్రణ విషయంలో కూడా జాగ్రత్తపడాలి. మధుమేహం కారణంగా కిడ్నీలు దెబ్బ తిన్నవారిలో దృష్టిలోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. 

                                        

అలాంటివారు, డయాబెటిక్‌ రెటినోపతి, ప్రొటీనూరియా వ్యాధులను స్ర్కీనింగ్‌ ద్వారా ఎప్పటికప్పడు తెలుసుకుంటూ ఉండాలి. డయాబెటిక్‌ న్యూరోపతికి ఆయా దశను బట్టి చికిత్స ఉంటుంది, మ్యాకులర్‌ ఎడీమా ఉంటే కొన్ని రకాల ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కళ్లు పొడిబారుతుంటే, చుక్కల మందు అవసరమవుతుంది.  చూశారుగా కదా.. ఇక్కడ ఉన్న జాగ్రత్తలు చదివి తెలుసుకోండి. జాగ్రత్త..పడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: