వైట్‌ డెత్‌.. అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు! కానీ, మనలో చాలామంది జీవితం ఉదయాన్నే దాంతోనే మొదలవుతుంది. అదేనండీ.. పంచదార. పాలల్లోనో, కాఫీలోనో చక్కెర కలుపుకొని తాగడంతోనే రోజు మొదలవుతుంది. మితంగా అయితే పంచదారవాడకం ఓకేగానీ.. ఎక్కువగా వాడితే అదే చక్కెర ఆరోగ్యానికి చేదు అవుతుంది. అసలు రోజువారీ ఆహారంలో అదనంగా చక్కెరను తీసుకోవడమే అనర్థాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. యాడెడ్ షుగర్ లో ఎలాంటి పోషకాలు ఉండ‌వు. కేవలం తక్షణం శక్తినిచ్చే కేలరీలు మాత్రమే ఉన్నాయి. పైగా పళ్లకు హానికరం.

 

అధికంగా పంచదారను తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు  చేరవవుతాయి. శరీరంలోని ట్రైగ్లిజరైడ్లను, ఎల్డీఎల్, రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను, ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోవడం లాంటి సమస్యలను ఉత్పన్నం చేస్తుంది. వీటితో గుండె సంబంధ వ్యాధులు సంభవిస్తాయి. పంచదార తిన్నప్పుడు మెదడులో బీటా ఎండార్ఫిన్లు ఉత్తేజితమవుతాయి. అందుకే మనకు ఆనందంగా అనిపిస్తుంది. కానీ.. ఎక్కువకాలంపాటు ఎక్కువ పంచదార తింటే శరీరాన్ని కాపాడే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. శరీరంలోని టిష్యూలు సంకోచ, వ్యాకోచాలను కోల్పోయి గట్టిగా అయిపోతాయి.

 

ఆరోగ్యవంతులైన వారు, చురుగ్గా ఉండేవారు అదనపు షుగర్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. అదే చురుగ్గా లేని వారు, అధిక కార్బొహైడ్రేట్లు, అధిక కేలరీలతో కూడిన పాశ్చాత్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల వారికి ముప్పు ఎక్కువ ఉంటుందని నిపుణుల హెచ్చరిక. మోతాదుకు మించి చక్కెరను తీసుకుంటే శరీరంలో హార్మోన్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది., దీని వల్ల స్థూలకాయానికి గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: