బీర‌కాయ తెలియ‌ని వారుండ‌రు. సహజంగా నోటికి బాగా రుచి అందించే కూరగాయల్లో బీరకాయ ముందు వరసలో ఉంటుంది. సాధారణ, నేతి బీరకాయ రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయ తినడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధ పడేవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది.

 

బీరకాయల్లోని పెప్టయిడ్స్, ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. బీరకాయల్లో రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. మ‌ద్యం సేవించేవారు బీర‌కాయ తిన‌డం వ‌ల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. మరియు మధ్యం మత్తు వైపు వెళ్ళకుండా తగ్గించడానికి సహాయపడుతుంది. ఎటువంటి అనారోగ్యానికైనా గురైనప్పుడు చాలా త్వరగా కోలుకొనేలా చేస్తుంది. అంతటి శక్తికలిగిన బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల శరీరానికి ఇంకా మేలు చేస్తుంది.


 
అలాగే బీరలోని మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, బరువు తగ్గించే డైట్ లిస్ట్ లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ, మరియు చాలా తక్కువ కొలెస్ట్రాల్ తీసుకొనేందుకు సహాయపడుతుంది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: