సాధార‌ణంగా టీని చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు. ఇక రోజు ఉదయం లేవగానే చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ళ వరకు టీ తాగడం మనందరికి అలవాటుగా మారింది. అస‌లు ప్రోద్దున్నే టీ తాగితే కానీ ఏ పని చేయలేం అన్నంత‌గా కొంద‌రు టీని అల‌వాటుగా మార్చుకుంటారు. మరైతే ఇంతగా అలవాటు అయినా టీ ని తాగడం మంచిదా? చెడ్డదా? అనే విషయం చాలా మంది ని వేధిస్తుంది. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే కాలీపొట్టతో, పరగడుపున టీ తాగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.

 

టీ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి, పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటికి కారణమవుతుంది. టీ తాగే  అలవాటు కొంతమంది లో కొన్ని సంత్సరాల నుండి ఉండడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి. అందులో ముఖ్యంగా టీ తాగకపోతే తలనొప్పి, అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనబడుతాయి. రోజూ పరగడపున టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దాంతో ఆకలి తగ్గిపోతుంది.

 

టీలో కెఫిన్, ఎల్ థైనిన్స్ మరియు థయోఫిలైన్ అధికంగా ఉండటం వల్ల అజీర్తికి కారణమవుతుంది. ఇక ఎక్కువగా టీ తాగడం వల్ల ఎదురయ్యే సమస్య ప్రొస్టేట్ క్యాన్సర్. ఒక రోజులో 4నుండి 5,6 కప్పుల టీ తాగే వారిలో 50శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తెలిసింది. టీ ఎక్కువగా తాగే చాలా మంది లో  కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. సాధరణ టీ అయినా, ఐస్ టీ అయినా ఏదైనా సరే కిడ్నీఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందట . సో.. బీ కేర్‌ఫుల్‌..!
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: