నెయ్యి.. ఇప్పుడు స్వచంగా ఉండటం లేదు కానీ.. సాధారణంగా అయితే నెయ్యి ఎంత స్వచంగా ఉంటుంది. అమ్మమ్మ.. నానమ్మ చేసే నెయ్యి అయితే ఇంకెంత స్వేచ్ఛంగా ఉంటుంది. అలాంటి ఈ నెయ్యితో ఎన్ని ఆరోగ్య లాభాలు ఉంటాయి తెలుసా ? అన్ని లాభాలు ఉన్న ఈ నెయ్యిని ఎలా వినియోగించాలి.. ఎలా వాడితే నెయ్యి లాభాలు ఇస్తుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

నెయ్యి ఆహార పదార్థంగానే కాదు, ఔషధంలా కూడా పనిచేస్తుంది. 

 

ఎముకల పటిష్ఠతకూ, జీర్ణక్రియ సజావుగా సాగడానికీ నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. 

 

శీతకాలంలో నెయ్యి దేహాన్ని వెచ్చగా ఉంచుతుంది. 

 

చర్మకాంతికీ, జుట్టు పోషణకూ నెయ్యి ఉపయోగపడుతుంది. 

 

నెయ్యి శరీరనికి శక్తిని ఇవ్వడంతో పాటు జ్ఞాపకశక్తినీ, మేధస్సునూ కూడా పెంచుతుంది. 

 

నెయ్యి శారీరక, మానసిక శక్తిని పెంచే ఒక టానిక్‌గా పనిచేస్తోంది. 

 

నెయ్యిని కొందరు ఔషధ మూలికా కషాయాలకు సమానంగా తీసుకుంటారు.

 

నెయ్యి మధుమేహన్నీ అదుపులో ఉంచుతుంది. 

 

నెయ్యి, పసుపుం నీళ్లు కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: