పై ఫొటోలోనున్న గడ్డ ఒక 50 ఏళ్ల లండన్ వ్యక్తి శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు పెరుగుతూ వచ్చింది. మూడేళ్ల క్రితం ఆ వ్యక్తి తన శరీరంపై ఏర్పడిన ఒక మచ్చని చూసి ఏమవుతుందిలే ఏదో చిన్న రాష్.. కొన్ని రోజుల్లో తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు. కానీ అది పెరుగుతూ ఉందే తప్ప ఎంతకీ తగ్గటం లేదు. తనకి ఏదో ఒక రోగం వచ్చిందని భావించిన ఆ వ్యక్తి స్నేహితుడి సాయంతో కౌంటెస్ అఫ్ చెస్టర్ హాస్పిటల్ కు వెళ్ళాడు. అప్పుడు అక్కడి డాక్టర్లు అతనికి టెస్ట్ చేసి ఒకటి చెప్పాడు. అది విని ఒక్కసారిగా అవాక్కయ్యాడు అతడు.


ఇంతకీ, ఆ కొమ్ము ఏంటంటే... ఒక అరుదైన క్యాన్సర్ కణతి. మొదట్లో దానిని గుర్తించిన లండన్ వైద్యులు కొన్ని సెకండ్ల పాటు స్టన్ అయ్యారు. ఎందుకంటే అంత పెద్ద క్యాన్సర్ గడ్డ అతని వెనుక భాగంలో పెరిగినప్పటికీ... అతని శరీరంలోని ఇతర భాగాలకు ఆ క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందలేదు. వాస్తవానికి.. అతడు గత మూడేళ్లలో ఒక్క డాక్టర్ వద్దకి కానీ, కనీసం మెడికల్ షాప్ కు కూడా వెళ్లలేదు. అయినా మూడు సంవత్సరాలు ఎలా బతికాడు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఈ క్యాన్సర్ ప్రాణాంతకమైనది కాదని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న క్యాన్సర్ గడ్డ ఏర్పడితేనే... కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఎంతో కష్ట సాధ్యమైన ట్రీట్మెంట్ తీసుకుంటారు క్యాన్సర్ పేషెంట్లు.


కానీ ఇతను విషయంలో అటువంటిదేమీ జరగలేదు. 5.8 అంగుళాల పొడవు, 2.3 అంగుళాల వెడల్పుతో భారీ కణితిగా పెరిగిన ఈ కొమ్మును సర్జరీ చేసి తొలగించారు చెస్టర్ హాస్పిటల్ వైద్యులు. పెరిగిన కణితిని తీసేసిన తరువాత రంధ్రము ఏర్పడిన అతని వెనుక భాగాన్ని తొడ నుంచి తీసుకున్న స్కిన్ తో పూడ్చేసారు. అతనికి వచ్చింది స్వేమస్ సెల్ కార్సినోమా (ఎస్‌సీసీ) స్కిన్ క్యాన్సర్ అని డాక్టర్లు చెబుతున్నారు. స్కిన్ క్యాన్సర్ చాలా నెమ్మదిగా పెరుగుతూ పోతుందని.. ఇంకా ప్రాణాలు తీసే క్యాన్సర్ కాదని డాక్టర్లు తెలిపారు. దీనిని నయం చేయడం కూడా సులభమట.దీన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ కేసు రిపోర్ట్స్ లో డ్రాగన్ కొమ్ము గా రాసినట్లు లండన్ వైద్యులు చెప్పారు.


అయితే, ఈ కణతి కేరాటిన్ అనే ప్రోటీన్ తో ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఈ ప్రోటీన్ తోనే మన గోళ్లు, జుట్టు ఇంకా స్కిన్ తయారవుతుంది. సూర్య రష్మి పడే భాగాలైన చెవులు, ముక్కు, గొంతు, వీపుపై స్కిన్ క్యాన్సర్ వస్తుందని వైద్యులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: