కొబ్బ‌రి నీళ్ల‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటితో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కూల్ డ్రింగ్స్, మద్యం తాగే బదులు కొబ్బరి నీళ్లు తాగితే.. ఆరోగ్యమే ఆరోగ్యం. సాధార‌ణంగా చాలా మంది కొబ్బ‌రి నీళ్లు తాగుతారు గానీ.. అందులో ఉండే పోష‌కాలు మాత్రం తెలుసుకోరు. అయితే వాటి కూడా ఓ లుక్కేసేయండి.

 

కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగ‌ల సామర్థ్యం కొబ్బ‌రి నీళ్ల‌కు పుష్క‌లంగా ఉంది. అలాగే యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు కొబ్బరినీళ్లలో ఎక్కువ. అవే చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి.  100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వందేళ్ల కిందటి వరకూ డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవాళ్లు కూడా.

 

కొబ్బరి నీళ్లలో ఫైబర్, విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా ఉండేవారు కొబ్బరి బోండాలు తాగితే ఎంతో మంచిది. మ‌రియు కొబ్బరి నీటిలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మీ ఎముకల్ని బలంగా చేస్తాయి. అందువల్ల ఎముకలు బలపడాలంటే రెగ్యులర్ కొబ్బని నీళ్లు తాగడం మంచిది. ఇక మ‌రీ ముఖ్యంగా.. చాలామంది రాత్రి తాగింది దిగకపోవడంతో హ్యాంగోవర్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: