ఈ సృష్టిలో ఖర్జూరాలు మన అదృష్టం కొద్దీ పుట్టిన ఫలాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్య ప్రదాయినిగా ఖర్జూరను పేర్కొంటారు. ఖర్జూరా తినడం వల్ల వివిధ రకాల వ్యాధులు ధరిచేరకుండా అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తియ్యగా, రుచిగా ఉండ‌డంతో వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. శారీరక శ్రమ చేసేవారు రోజూ ఖర్జూర తినడం ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపకశక్తి తగ్గిన వారు ఖర్జూర తరచూ తింటే మరలా మామూలు స్థితికి వస్తారు. అలాగే ఖ‌ర్జూరంలో సెలెనియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం కూడా ఉంటాయి.

 

మ‌రి డయాబెటిస్ ఉన్నవారిని ఎక్కువ షుగర్ ఉండే, ఎక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తినవద్దని అంటుంటారు. మరి వాళ్లు ఖర్జూరాలు తినవచ్చా? అన్న ప్ర‌శ్న చాలా మందికి వ‌స్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి.. రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌ల వంటివి చేస్తే గానుక‌.. రోజుకు ఒక‌టి నుంచీ మూడు ఖర్జూరాలు వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదీ కూడా డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇత‌ర పండ్ల‌తో పోలిస్తే ఖర్జూరాలు ఎండినట్లు ఉంటాయి. కాబట్టి.. వాటిలో నీరు లేకుండా పూర్తిగా కేలరీలే ఉంటాయి. 

 

అందువల్ల వాటిని తినగానే ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్లకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. సో.. అలాంటి వీటికి దూరంగా ఉండ‌డ‌మే మంచిది. ఇక డయాబెటిస్ పేషెంట్ల కాకుండా మిగిలిన వారైతే ఖ‌ర్జూరం తిన‌డం చాలా మంచిది. జీర్ణవ్యవస్థలో వచ్చే సమస్యలకు ఖర్జూరాలు మంచి ఔషధం. ఖర్జూరలో విటమిన్ ఏ అధికంగా ఉండటం కారణంగా వాటిని తింటే కంటికి మంచిది.గుండెలో మంట అనిపించే వారికి ఇంకా మంచి ఔషధంగా పనిచేస్తుంది. దాంతో శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: