కుంకుమ పువ్వు.. పుట్టబోయే బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలని గర్భిణీలను పాలలో కొంచం కుంకుమ పువ్వు కలుపుకోమని తాగమని చెప్పినప్పుడు మనం విని ఉంటాం. ఆలా ఎందుకు చెప్తారంటే.. కుంకుమ పువ్వులో శక్తి వంతమైన మూలికాలు యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఐరన్ శాతం పుష్కలంగా దొరుకుతుంది. 

 

అయితే ఈ కుంకుమ పువ్వు కావాల్సినంత అందాన్ని ఇస్తుంది. ఎంతో అందం ఇచ్చే ఈ కుంకుమ పువ్వులో ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కుంకుమ పువ్వుని ఆరోగ్యానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఉన్న చిట్కాలను చదివి తెలుసుకోండి. 

 

కెరోటినాయిడ్లు, బి విటమిన్‌ పుష్కలంగా ఉండే కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చుకుంటూ ఉంటె మెదడును ప్రభావితం చేసి ఆనందం కలగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

 

దీనిలోని కెరోటిన్స్‌, జీగ్జాంథిన్‌, లైకోపిన్‌లు ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అందుకే క్రమం తప్పకుండా కుంకుమ పువ్వును తీసుకునేవాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు.

 

ఈ కుంకుమ పువ్వులోని పొటాషియం, విటమిన్‌ సి రక్తపోటును నియంత్రించి గుండెకు రక్షణ కల్పిస్తుంది. గుండె సంబంధ జబ్బుల బారిన పడే అవకాశాలను కుంకుమపువ్వు తగ్గిస్తుంది.

 

చూశారుగా.. ఈ చిట్కాలను పాటించి కుంకుమ పువ్వతో ఈ లాభాలు పొందండి.. ఆరోగ్యాన్ని పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: