సాధార‌ణంగా ఏ థియేటర్లలోనో.. లేదా ఇంటి దగ్గర సినిమాలను చూసేటప్పుడు మనము ఎక్కువగా తీసుకునే స్నాక్స్ పాప్-కార్న్. అయితే ఒక క‌ప్పు పాప్ కార్న్‌లో ఒక గ్రామ్ ఫైబ‌ర్ ఉంటుంది. క‌నుక రోజుకు నాలుగు క‌ప్పుల వ‌ర‌కు పాప్ కార్న్ తిన్నా చాలు. దాంతో నాలుగు గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందుతుంది. త‌ద్వారా జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. పాప్-కార్న్ ఫైబర్ ను కలిగి ఉంది, ఇది రక్త నాళాలు మరియు ధమనుల గోడల మీద పేరుకుపోయిన అదనపు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతుంది. 


అలా మీ శరీర మొత్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గిస్తుంది. ఇది హృదయ రుగ్మతలను అనగా, గుండె పోటును మరియు స్ట్రోక్ వంటి హృదయనాళము యొక్క విషమ పరిస్థితుల అవకాశాలను బాగా తగ్గిస్తుంది. పాప్ కార్న్‌ తినటం వలన వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడుతలను, వయసు మచ్చలను, మాక్యులార్ డిజెనరేషన్ వల్ల వచ్చే అంధత్వమును, కండరాల బలహీనత మరియు జుట్టు ఊడిపోవడం వంటి వయస్సు- ఆధారిత లక్షణాలకు చికిత్సను చేయవచ్చు.


పాప్ కార్న్‌ లో ఉన్న శక్తివంతమైన అమ్ల జనకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పాప్ కార్న్‌ లో అధిక మోతాదులో మాంగనీస్ ఉంది. ఇది బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించి, అదే స్థాయిలో వాటి దృఢత్వాన్ని కొనసాగేలా ఉంచడానికి సహాయపడుతుంది. పాప్ కార్న్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మ‌రియు క్యాన్సర్ ను నిరోధించటంలో కూడా పాప్ కార్న్ ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.


పాప్ కార్న్‌ అనేది ధాన్యమనే సంతతికి చెందినందున అందులో ఎండోస్పెర్మ్, జెర్మ్ మరియు బ్రాన్ అనే విశేష అంశాలను కలిగి ఉంటుంది మరియు సహజమైన ధాన్యంగా ఉండటం వల్ల, జీర్ణక్రియకు సహాయపడే అన్ని రకాల ఫైబర్లను కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకు సరైన రీతిలో సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: