ఆరోగ్యం గా ఉండడమంటే ఆనందంగా ఉండటమే. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు ఖ‌చ్చితంగా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే ప్రయత్నాలు ఎన్నో. కానీ, ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎక్కువ శాతం అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతారు. ఇక ఏ ఆహారమైతే మనము తీసుకుంటే మన ఆరోగ్యము పెంపొందించి, అనారోగ్యపాలుకాకుండా శక్తివంతముగా ఉంచి జీవనపరిమాణము మెరుగవుతుందో దానినే పౌష్టికాహారము అంటాము. అయితే చాలా మందికి ఉదయం వండిన ఆహార పదార్థాలను మధ్యాహ్నం తినేటప్పుడో లేదా రాత్రి తినేటప్పుడో మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినే అలవాటు ఉంటుంది.

 

కానీ.. అలా వేడి చేసి తిన‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ‌రీ ముక్యంగా ఈ ప‌దార్థాలు అస్సలు వేడి చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుత‌న్నారు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. పుట్టగొడుగుల్ని సరిగా నిల్వ చేయకపోయినా, తిరిగి వేడి చేసినవి తిన్నా పొట్ట పాడయిపోతుంది. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన ఒక రోజు లోపయితే 70 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయొచ్చు. చికెన్‌ను ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. 

 

లేదంటే చికెన్‌లో కొద్ది మొత్తంలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో ప్రమాదమే. మ‌ళ్లీ మ‌ళ్లీ ఉడికించ‌డం వ‌ల్ల చికెన్‌లో ప్రొటీన్లు భిన్నంగా విడిపోయి కడుపులో ఇబ్బంది కలిగిస్తాయి. మనం రోజూ తినే అన్నాన్ని కూడా రెండోసారి వేడి చేసి తినకూడదు. గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే  స్పోర్స్ రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టే. అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్‌ ఉంటుంది. తరువాత ఇదే నైట్రోజమైన్స్‌గా మారుతుంది. దీన్ని వేడి చేయ‌డం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: