సాధార‌ణంగా మిరియాలు తెలియ‌ని వారుండ‌రు. సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండేవి. ఆహారాల్లో రుచిని పెంచడానికి మిరియాలను వాడతారు. దీంతో ఆహారానికి మంచి రుచి వాసన వస్తుంది.  ఘాటులోనే కాదు ఔషధ గుణాల్లోను మేటి అయిన మిరియాల వల్ల బోలెడు ఆరోగ్య లాభాలున్నాయి. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువ. మిరియాలు అధిక బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. 

 

రోజూ మన భోజనంలో చిటికెడు మిరియాల పొడిని వేసుకుంటే నాజూగ్గా తయారవచ్చు. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికారక ప్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. మిరియాలు శ్వాసక్రియలో అవాంతరాలను అడ్డుకొని కోరింత దగ్గు నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. 

 

అంతేకాదు ఆస్తమా లక్షణాలను నివారిస్తాయి కూడా. టీ స్పూను మిరియాల పొడిని, రెండు టేబుల్‌ స్పూన్ల తేనెతో కలిపి తీసుకుంటే ముక్కుదిబ్బడ సమస్య తగ్గుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మ‌రియు మిరియాలతో చేసిన టీ తాగితే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: