జీవితం ఆరోగ్యంగా సాగాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని సూచిస్తుంటారు. మనం రెగ్యులర్ గా తినే ఆహారాల్లోనే ఔషధగుణాలెన్నో దాగుంటాయి. అలాంటి ఫుడ్స్‌లో మునగాకు కూడా ఒక‌టి. మున‌గ ఆకును రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తిన్నా... లేదంటే మున‌గ ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకున్నా ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మునగాకులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసం తినని వారికి మునగాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. మునగ ఆకులూ, గింజలకూ, పూలకు యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉన్నాయి. 

 

మునగలో విటమిన్‌ సి అధికమోతాదులో లభించడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పాల‌క‌న్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మునగాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు బలంగా ఉంటాయి. దంతాలు దృఢంగా త‌యార‌వుతాయి. మునగాకు కొంచెం కారంగా, వెగటుగా అనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలే మునగాకును కొంతమంది ఇష్టపడకపోవడానికి కారణం అవుతున్నాయి. అయితే అలవాటు చేసుకుంటే ఈ లక్షణాలు పెద్దగా ఇబ్బంది కలిగించవు. మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు జరుగుతుంది.

 

మునగాకును ఆహారంగా తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి. అలాగే తలనొప్పికి మునగాకు దివ్యౌషధం. మునగాకును ముద్దగా చేసుకుని కొద్దిగా మిరియాలపొడి చేర్చి నుదురుపై రాస్తే తలనొప్పి మాయమవుతుంది. మ‌రియు మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకులో ఉన్నన్ని విటమిన్లు వుండవు. ఇక మధుమేహ బాధితులు మునగాకుని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: