ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను పట్టి పీడిస్తుంది.. అత్యంత తక్కువ సమయంలోనే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజానాలు భయపెడుతుంది.. ఈ కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు.. ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు.. ఇప్పటికే కొన్ని స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు.. 

 

కొన్ని సాఫ్ట్ వెర్ కంపెనీలు కరోనా భయంతో ఉద్యోగులను ఇంటి నుండే పని చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.. అయితే కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు.. మీడియా సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా భారిన పడకుండా ఎల్లప్పుడూ ఉపయోగించాల్సిన శానిటైజర్ కు డిమాండ్ భారీగా పెరుగుతుంది. అందుకే శానిటైజర్ ని ఇంట్లోనే చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. అయితే ఆ శానిటైజర్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

శానిటైజేర్ ఎలా చేయాలో అమెరికాలోని ఓ ప్రముఖ వైద్యుడు ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికకు వివరించారు. ఎలా చెయ్యాలి అంటే? కలబంద, రబ్బింగ్‌ ఆల్కహాల్‌గా పిలిచే ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ పదార్ధాలు కావాలి. రబ్బింగ్‌ ఆల్కహాల్‌, కలబంద పదార్ధాలను బాగా కలిసే వరకు మిశ్రమంగా కలుపుకోవాలి. 

 

ఆల్కహాల్‌ వాసన పోయేలా ఈ మిశ్రమానికి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కలుపుకోవాలి. దీన్ని ఓ బాటిల్‌లో స్టోర్‌ చేసుకొని శానిటైజర్‌గా వాడుకోవచ్చు. అయితే ఈ మిశ్రమంలో 60శాతం ఆల్కహాల్‌ ఉంటేనే ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇంట్లోనే ఈ శానిటైజర్ ను చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: