జాజికాయ.. మన పూర్వికులు పురాతన కాలం నుంచి అనేక వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. వీటిని మ‌న దేశంలోనే కాకుండా ఇండోనేషియా, మ‌లేషియా, గ్రెన‌డా వంటి దేశాల్లోనూ ఎక్కువ‌గా పండుతుంది. సుగంధ ద్రవ్యాలలో జాజికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆహారానికి సువాసన, రుచి పెంచడంతో పాటు అనేక ఔషధ గుణాలను జాజికాయ కలిగి ఉంది. మ‌రి  జాజికాయ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో త‌క్కువ‌ పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అలసట, ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనివ్వదు. నిద్రలేమి సమస్యతో సతమతం అయ్యేవారు జాజికాయ తీసుకుంటే మంచి గాఢనిద్ర పడుతుంది. 

 

అదేవిధంగా, తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది. అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. సో.. జాజికాయ అప్పుడుప్పుడూ ఉప‌యోగిస్తూ ఉండండి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: