ఇటీవ‌ల కాలంలో మ‌ధుమేహం స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు అవసరమైనంత ఇన్సులిన్‌ను శరీరం ఉత్పత్తి చేయలేకపోతే మధుమేహ సమస్య తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో సుమారు 40 కోట్ల మంది  మధుమేహ సమస్యతో ఇబ్బందిప‌డుతున్నారు. ఇక‌ మధుమేహం కంట్రోల్ కాకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మ‌ధుమేహాన్ని కంట్రోల్‌లో పెట్టే ఆహారాల్లో ప‌సుపు కూడా ఒక‌టి.

 

పసుపు.. ఆరోగ్యానికి మరియు అందాని ఎంతో ప్రయోజన అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు వేయనిదే ఏ వంటకం పరిపూర్ణం కాదని పూర్వికుల విశ్వాసం. ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేసే పసుపు గురించి చాలా మంది కొన్ని విష‌యాలు అవ‌గాహ‌న ఉండ‌దు. పసుపును డైట్‌లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్‌పై చక్కటి ప్రభావం చూపించి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఔషధ గుణాలు ఎక్కువ. 

 

ముఖ్యంగా పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదో అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. ఈ కర్క్యుమిన్ మన శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అందువల్ల రక్తనాళాల్లో కొవ్వు కరిగి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అది డయాబెటిస్ తగ్గేందుకు, కంట్రోల్ అయ్యేందుకూ వీలు కలిగిస్తుంది. అలాగే కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడంలో పసుపు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి

మరింత సమాచారం తెలుసుకోండి: