లాక్‌డౌన్ ప‌రిణామంతో భార‌త్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల‌ను స్వ‌దేశాల‌కు చేర్చే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం మొదలు పెట్టింది. శుక్ర‌వారం ప‌లు దేశాల‌కు చెందిన విదేశీయుల‌ను భార‌త్‌ను విమానాల్లో పంపించింది. వారంద‌రికీ ఆరోగ్య ప‌రీక్ష‌లు, ముఖ్యంగా క‌రోనా టెస్టులు పూర్తి చేశాకే విమాన ప్ర‌యాణానికి అనుమ‌తిచ్చింది. పూర్తి శానిటైజేషన్‌ చేసిన టెర్మినల్‌ ద్వారా వీరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలతోపాటు ఇమిగ్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు.రాష్ట్రంలోని ప‌రిస్థితుల విష‌యానికి వ‌స్తే లాక్‌డౌన్‌ తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కార్గో విమానాలు కాక 5 ప్రయాణికుల విమానాలు రాకపోకలు సాగించాయి. 

 

ఈ నెల 7న కూడా ఇక్కడి నుంచి అమెరికాకు ఓ విమానం బయలుదేరి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్‌ సమన్వయంతో శుక్రవారం పలువురు అమెరికన్లు 2 ఎయిరిండియా విమానాల్లో ఇక్కడి నుంచి ముంబై మీదుగా ఆయా దేశాల‌కు బ‌య‌ల్దేరి వెళ్లాయి. మధ్యా హ్నం 3 గంటల సమయంలో ఏఐ-1615 విమానం 69 మంది పెద్దలు, ఒక శిశువుతో ఇక్కడి నుంచి ముంబైకి బయల్దేరగా.. ఏఐ-1617 విమానం 96 మంది పెద్దలు, ఇద్దరు శిశువులతో సాయంత్రం 4.24 గంటలకు టేకాఫ్‌ తీసుకుంది. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్‌ ఎక్విప్‌ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్‌ అధికారులు తెలిపారు.


ఇంత‌కు ముందే హైదరాబాద్‌లో చిక్కుకున్న 38 మంది జర్మన్‌ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించారు. లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి జర్మనీ కాన్సులేట్‌ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు  ఫలించాయి. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్క‌డే ఆగిపోవాల్సి వ‌చ్చింది. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: