రోగ నిరోధక శక్తి..మనం ఈ పదాన్ని  చిన్నతనం నుంచీ వింటూనే ఉన్నాం..అది మనిషి బ్రతకడానికి ఎంతో ముఖ్యమైనది స్కూల్ పుస్తకాలలో చదువుకున్నాం. కానీ ఏదన్నా అవసరం అయితేనే కాని మనకి దాని  ఉపయోగం తెలియదు అంటారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో రోగ నిరోధక శక్తి అనే పదాన్ని ప్రతీ రోజు వింటూనే ఉన్నాం. ఇది శరీరంలో తగినంతగా ఉంటే కరోనా లాంటి వైరస్ లు ఎన్ని వచ్చినా సులువుగా ఎదుర్కోనవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు..

IHG

మరి పూర్వం ఈ రోగ నిరోధక శక్తి పెరగడానికి రకరకాల పద్దతులు అవలంభించే వాళ్ళు. వాటిలో ముఖ్యమైనది రాగులు.వీటిని తినే ఆహారంలో చేర్చుకుని ఎంతో ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందేవారు. వీటి వల్ల రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది. వీటి ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాగులలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం,శరీర బరువుని తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. మధుమేహం తో బాధపడే వారు సైతం రాగులు తీసుకోవడం ఎంతో మంచిది. రాగులలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటంటే..

IHG's Kitchen

చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇవి శరీరంలో చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి వేసవిలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. రాగులలో చెడు కొవ్వుని తగ్గించే గుణాలు ఉంటాయి అందుకు బరువు ఉన్న వారికి వైద్యులు రాగులు తినమని సూచిస్తారు. యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి, అధిక సంఖ్యలో ప్రోటీన్ లు కూడా లభ్యమవుతాయి. ఎముకలు, దంతాలు ఎంతో బలంగా తయారవుతాయి. ఇవన్నీ సమపాళ్ళలో శరీరానికి అందడం వలన  శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తి స్థాయిలో పుష్కలంగా అందుతుంది. తద్వారా శరీరం ఎలాంటి వైరస్ లపై అయినా పోటీ పడే శక్తిని కలిగి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: