క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.  ఇప్పటికే ఈ మహమ్మారి 212 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షల చేరువలో ఉన్నాయి. 13 లక్షల మందికిపైగా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ఇక ఈ మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.

 

అయితే లాక్ డౌన్ లో డెలివరీ అయితే గ‌నుక ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఎందుకంటే.. వృద్ధులూ, గర్భిణీలూ హై రిస్క్ కేటగిరిలో ఉన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పట్నించీ పసిపిల్లలకి కూడా ఈ వైరస్ సోకుతున్నట్టుగా ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అలాగే తల్లి నుంచి బిడ్డకి సోకే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాలి. గర్భం ధరించినప్పుడు మమూలుగానే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది.అంటే, మీరు మీ కోసం, మీ బిడ్డ ఆరోగ్యం కోసం కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం త‌ప్ప‌కుండా పాటించండి. 

 

ఇక ఇలాంటి విప‌త్క‌ర టైమ్‌లో బిడ్డ పుట్టాలని నిజంగా ఎవ్వరూ కోరుకోరు. ఈ క్ర‌మంలోనే మీ గురించీ, బిడ్డ ఆరోగ్యం గురించీ తెగ ఆందోళన చెందడం సహజం. ఆ ఆందోళ‌న బిడ్డ ఆరోగ్యంపై ప‌డుతుంది. కాబ‌ట్టి భయపడకుండా వైద్యనిపుణుల సలహాలు తీసుకుంటూ స్ట్రోంగ్‌గా ఉండండి. డెలివ‌రీ అయ్యాక‌ బిడ్డని ఇంటికి తీసుకువచ్చిన తరువాత బిడ్డకు సంబంధించిన వస్తువులన్నీ మీకు కావాల్సి వ‌స్తుంది. సో.. ఇవన్నీ ముందే అందుబాటులో ఉంచుకోండి. ఒకసారి మీ బిడ్డ మీ ఇంట్లో ప్రవేశించాక శానిటైజేషన్ కి అత్యంత ప్రాధాన్యతనివ్వండి. మ‌రియు మీ బిడ్డని చూడటానికి వచ్చేవాళ్ళని రానివ్వక‌పోవ‌డం మ‌రీ మంచిది. ఇక ఆహార విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అప్పుడు మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: