క‌రోనా వైర‌స్ గురించి అధ్య‌య‌నం చేస్తున్న వైద్య‌నిపుణులు, శాస్త్ర‌వేత్త‌ల‌కు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు బోధ‌ప‌డుతున్నాయి. క‌రోనా వైర‌స్ త‌న సామ‌ర్థ్యాన్ని పెంపొందించుకుంటోంద‌ని, గాలిలో ఎక్కువ‌దూరం ప్ర‌యాణించ‌డంతోపాటు ఎక్కువ సేపు మ‌న‌గ‌లుగుతోంద‌ని గుర్తించిన విష‌యం తెలిసిందే. ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌కుండా క‌రోనా సైలెంట్‌గా కిల్ చేస్తోంది. తాజాగా మ‌రో విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. అదేమంటే దేశ వ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసుల్లో ఆదివారం నాటికే 63 శాతం మంది కోలుకొని ఇళ్ల‌కు వెళ్లిపోతుండ‌గా కొంత‌మంది రోగుల్లో మాత్రం వ్యాధి ల‌క్ష‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

దాదాపు 40 రోజులుగా ఆసుపత్రుల్లోనే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం విష‌యానికి వ‌స్తే గత ఏప్రిల్‌ 1 నుంచి 20 వరకూ నిర్ధారించిన పాజిటివ్‌ కేసుల్లో 129 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. సాధార‌ణంగా అయితే  రెండు నుంచి మూడు వారాల్లో వైర‌స్ బారి నుంచి బ‌య‌ట ప‌డాలి. వృద్ధులు, చిన్నారులు, ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉన్న‌వారిలో మ‌రో వారం రోజులు అధికంగా ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే కొంత‌మందిలో మాత్రం దాదాపు 5వారాలు దాటినా కోలుకోక‌పోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

 

దీర్ఘకాలంగా ఆస్ప‌త్రిలో ఉంటున్న వారికి 10 నుంచి 15 సార్లైనా పరీక్షలు నిర్వహించాల్సి వ‌స్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత తగ్గకపోవ‌డంతో ఇళ్ల‌కు పంపే వీల్లేకుండా ఉంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. క‌రోనా వైద్య‌ప‌రీక్ష‌ల విధానాల ప్ర‌కారం.. వరుసగా రెండుసార్లు పరీక్షల్లో నెగిటివ్‌గా వ‌స్తే గాని ఇంటికి పంపేందుకు వీల్లేదు. అయితే తాజాగా డిశ్ఛార్జి నిబంధనల్లో ఐసీఎంఆర్‌ మార్పులు చేసింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల్లో 14 రోజుల తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే.. వారికి పరీక్షలు నిర్వహించకుండానే ఇళ్లకు పంపించవచ్చని పేర్కొంది.

 

 


మోదీ నిర్ణ‌యం అద్భుతం

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: