పచ్చడి.. ఎంత అద్భుతమైన రుచి ఇస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత కాదు అనుకున్న సరే.. పచ్చడి రుచి ప్రతి పూటా నోటికి తగలాల్సిందే. పచ్చడి అంటే అంత పిచ్చి మరి. అలాంటి పచ్చడిని చెపాతి, అన్నం, పెరుగన్నం.. ఆఖరికి బిర్యానీకి కూడా పచ్చడి తగలాల్సిందే.. లేకుంటే తిన్నట్టు ఉండదు అని కొందరు అంటుంటారు. అయితే పచ్చడి ఎంత రుచిగా ఉన్న.. ఎంత తినాలి అని మీకు అనిపించినా సరే ఆ పచ్చడి తినడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తేనే ఆరోగ్య సమస్యలు అనేవి రావు. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ పచ్చడిని ఎంత తినాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

వేసవి కాలం కదా! అందరూ ఆవకాయ, నిమ్మకాయ పచ్చళ్ళు అందరూ పెడుతుంటారు. ఇంకా ఆ రుచి అయితే ఎంత బాగుంటుందో. తలుచుకుంటేనే నోరు ఊరిపోతోంది. ఇంకా ఆ పచ్చడి, కాస్త నెయ్యి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అబ్బో మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా ఆ రుచి ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైన రుచిని కూడా లిమిట్ లోనే తినాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. 

 

అందుకే మామిడి పండ్లు కానీ, ఆవకాయ అన్నం కానీ ఈ రెండింటిని అందరూ ఇష్టపడుతారు.. కానీ వీటి రుచి ఆస్వాదించడం మంచిది. అయితే ఇవి రెండు లిమిట్ లో నే తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ఏ ఆహారం అయినా సరే అతిగా ఏది తినకూడదు. ఆరోగ్యం బాగుండాలి అంటే పచ్చళ్ళను అతిగా తినకుండా లిమిట్ లో తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.       

మరింత సమాచారం తెలుసుకోండి: