చేప‌లు.. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదుగా ఉంటారు. చికెన్, మటన్ కంటే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన మరియు ఆవశ్యక పోషకాలతో లోడ్ చేయబడి ఉండడమే కాకుండా, ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలకు కూడా చేప‌ల్లో ఉంటాయి. అందుకే శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఆరోగ్యవంతమైన ఆహారాల్లో చేపలు కూడా ఒకటి అని అంటారు. అలాగే చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. సూర్యుడి ద్వారా మనకు లభించే డి విటమిన్ చేపల్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. 

 

ఎముకల ఎదుగుదలకు ఈ డి  విటమిన్ ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే చిన్నా చేప‌లు తింటే మంచిదా.. పెద్ద చేప‌లు తింటే మంచిదా అంటే.. బాగా పెరిగిన, కొవ్వుపట్టి ఉన్న చేపల్ని తింటే.. వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు గుండె జబ్బులు రాకుండా ఆపుతుందని నిపుణులు అంటున్నారు. వాస్త‌వానికి పెద్ద పెద్ద చేపల్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్... హై డెన్సిటీ లైపోప్రోటీన్ ను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి.

 

ఇది మ‌ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల పెద్ద పెద్ద చేపల్ని తినమని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అంతేకాకుండా కళ్ళ కండరాలకు, నరాలకు పోషణను అందివ్వడంలో సహాయం చేస్తాయి. అలాగు స్త్రీలలో పీరియడ్స్ సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. చేపలను తరచూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

   

మరింత సమాచారం తెలుసుకోండి: