సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం లేవ‌గానే టీ లేదా కాఫీ తాగ‌డం అల‌వాటు. రోజుకు ఒక్కసారి తాగే వారి నుంచి రోజుకు లెక్కకు మిక్కిలిగా తాగే వారి వరకు అనేక మందికి ఈ పానీయం తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.  ఉద‌యం లేవ‌గానే టీ లేదా కాఫీని సేవించడం వల్ల.. రోజును ఫ్రెష్‌గా ప్రారంభించే వీలుంటుందనేది వారి ఫీలింగ్. ఇక రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల టీ లేదా కాఫీ తాగడం వల్ల.. శరీరానికి ఎటువంటి స‌మ‌స్య ఉండ‌దు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. టీ తాగిన తర్వాత నీళ్లు తాగ‌వ‌ద్ద‌ని పెద్దవాళ్లు చెబుతారు. అలా చేస్తే పళ్లు ఊడిపోతాయని అంటారు. ఒక వేళ నీళ్లు కావాలంటే టీ కంటే ముందే తాగేయాలని తెలుపుతారు.

 

కానీ, కొందరికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు వల్ల పెద్దగా నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇక టీ, కాఫీలు తాగే ముందు నీళ్లు తాగితే మంచి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టీ, కాఫీ, పాలు తాగే ముందు నీళ్లు తాగడం మంచిద‌ట‌. ఎందుకంటే.. దీని వల్ల నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ దెబ్బతినకుండా ఉంటాయి. ముందుగా నీళ్లు తాగడం వల్ల అవి కాస్త ఉష్ణోగ్రతను భరించగలుగుతాయి.

 

అదేవిధంగా, కాఫీ పౌడ‌ర్‌లో టీ కంటే ఎక్కువ శాతం కెఫిన్‌ ఉంటుంది. అయితే దీన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు కానీ, ఎక్కువ మోతాదులో తాగితే మాత్రం కెఫిన్ స్థాయిలు పెరిగి కాలేయ సంబంధిత వ్యాధులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎక్కువ టీ, కాఫీలు తాగేవారు ముందుగానే కొన్ని నీళ్లు తాగితే మంచిదంటున్నారు నిపుణులు. మ‌రియు టీ, కాఫీలు ఎసిడీటీ కలిగిస్తాయి. వాటి వల్ల దంతాలు పాడయ్యే ప్రమాదం కూడా ఎక్కువ‌గా ఉంటుంది.  అందుకే నీళ్లు తాగిన తర్వాత టీ, కాఫీలు తీసుకుంటే ఏ సమస్య ఉండ‌దంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: