దేశం గాని దేశంలో మేం ఎంతో ఇబ్బందిప‌డుతున్నాం. దోహ, ఖతార్ నుంచి హైదరాబాద్ కు విమానాల సంఖ్య పెంచేలా కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపి ఆదుకోవాలని దోహ, ఖతార్ లోని తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ ప్రజా సమితి, ఖతార్ తెలంగాణ జాగృతి ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ను వేడుకుంటున్నారు. ఈ మేరకు దోహ, ఖతార్ లోని తెలంగాణ వాసుల సమస్యలను వివరిస్తూ వారు వినోద్ కుమార్ కు లేఖ రాశారు. దోహ, ఖతార్ లో 70 వేల మంది తెలంగాణ వాసులు నివాసం ఉంటున్నారని, వివిధ కారణాలతో తక్షణమే హైదరాబాద్ కు తిరిగి రావాల్సిన అవసరం ఉన్న వారు 3,500 మంది ఖతార్ ఇండియన్ ఎంబసీ లో తమ పేర్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారని ఆ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

 

 ప్రస్తుతం ఒకే ఒక్క విమానం దోహ, ఖతార్ నుంచి హైదరాబాద్ కు నడుస్తోందని, ఈ విమానంలో కేవలం 183 మంది ప్రయాణికులకు మాత్రమే అవకాశం ఉంటోందని వారు ఆ లేఖలో తెలిపారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, గర్భిణులు, షార్ట్ టైమ్, ఎర్రివల్ వీసా ల గడువు ముగియడం, గత మూడు నెలలుగా దోహ, ఖతార్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబ సభ్యుల మరణాలు వంటి కారణాలతో వెంటనే హైదరాబాద్ కు తిరిగి రావాల్సిన వారి సంఖ్య 3,500 మంది వరకు ఉందని ఆ ప్రతినిధులు వివరించారు. కొవిడ్ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చే ప్రయాణీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు విధిగా పాటిస్తారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి దోహ, ఖతార్ నుంచి హైదరాబాద్ కు విమానాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని వారు వినోద్ కుమార్ ను కోరారు.


 రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు లేఖ రాసిన వారిలో తెలంగాణ గల్ఫ్ సమితి ప్రధాన కార్యదర్శి బొడ్డు ప్రేమ్ కుమార్, ఖతార్ తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు తిరుపతి చెన్నవేని, ఖతార్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నందిని అబ్బగౌని ఉన్నారు. ఇదిలా ఉండ‌గా  కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాసిన వినోద్ కుమార్దో హ, ఖతార్ తెలంగాణ సంఘాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ కు శుక్ర‌వారం వెంట‌నే లేఖ రాశారు. దోహ, ఖతార్ నుంచి హైదరాబాద్ కు విమానాల సంఖ్యను పెంచాలని, గల్ఫ్ లోని తెలంగాణ వారిని తక్షణమే తిరిగి సొంత గ్రామాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర విదేశాంగ మంత్రి కి రాసిన లేఖలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: