ప‌చ్చి అర‌టికాయ‌తో ఎన్నో వంట‌లు చేస్తుంటారు. అర‌టికాయ చిప్స్‌, అర‌టికాయ బజ్జీ, అర‌టికాయ ఫ్రై, అర‌టికాయ క‌ర్రీ ఇలా ఎన్నో ర‌కాల ఐటెమ్స్ చేస్తుంటారు. ఇలా పచ్చి అరటికాయలను ఉడికించి, లేదా ప్రొసెస్ చేసి లేదా ఫ్రై చేసి తింటుంటారు. అయితే అర‌టి పండు తిన్న విధంగానే పచ్చి అరటిపండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. పచ్చి అరటికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

 

శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు. పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి, కిడ్నీలలో రక్తం ప్యూరిఫై చేయడానికి మ‌రియు మజిల్ మూమెంట్స్ ను మెరుగుపరచడానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ప‌చ్చి అరటికాయలను తినడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంద‌ట‌. అదేవిధంగా, పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉంటాయి. పచ్చి అరటిపండ్లు తినడం ద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఏర్పడటానికి సహాయపడుతుంది. 

 

మంచి బ్యాక్టీరియా తిన్న ఆహారంను తేలికగా జీర్ణమవ్వడానికి సహాయపడుతాయి. ఇక టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చి అరటిపండ్లను తినవచ్చు. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి  పచ్చి అరటికాయ ను ఉడికించి తీసుకోవచ్చు. పచ్చి అరటికాయ తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వ‌స్తుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీంతో బరువు కూడా త‌గ్గుతారు. మ‌రి ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న ప‌చ్చి అరటికాయ‌ రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: