ఈ సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. కానీ నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రికి పెద్ద స‌వాల్‌గా మారింది. ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే ప్రయత్నాలు ఎన్నో. అది తిన‌కూడ‌దు, ఇది తిన‌కూడ‌దు, ఏం తినాలి, ఎంత తినాలి ఇలా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవ‌డం చాలా ముఖ్యంగా అలాంటి మంచి ఆహారంలో బీన్స్ కూడా ఒక‌టి. బీన్సులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

 

ముఖ్యంగా భయంకరమైన ఆరోగ్య సమస్యలకి, వాటికి కారణమయ్యే కొలెస్ట్రాల్‌ని ఎదుర్కొనే శక్తి బీన్సులో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌లో ఐరన్‌, మినరల్స్‌, మిటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఐరన్‌ లోపం తగ్గుతుంది. అలాగే బీన్స్ లో పిగ్మెంట్ యాంటీయాక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్ పుష్కలంగా ఉండటం వల్ల గౌట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించి, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక వారంలో నాలుగురోజుల పాటు మన ఆహారంలో బీన్సును చేర్చి తినడం వల్ల గుండె నొప్పిని తగ్గించవచ్చట. 

 

అది కూడా 70 శాతం వరకు గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా మలబద్దకంతో బాధపడే వారికి బీన్సు మంచి మందుగా పనిచేస్తుంద‌ని.. అలాంటివారు త‌మ డైట్‌లో బీన్స్ చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణ‌లు. ఒక కప్పు ఉడికించి తీసుకుంటే పదిశాతం కొలెస్ట్రాల్ తగిపోతుందట. కొన్ని ప‌రిశోధ‌న‌ల అనంత‌రం ఈ విష‌యాన్ని వెల్ల‌డించాలు శాస్త్ర‌వేత్త‌లు. బీన్స్‌లో ఉండే అద్భుత పోషకాలే ఇందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. బ్లడ్ షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేయాలంటే, బీన్స్ లోని కార్బోహైడ్రేట్స్ అద్భుతంగా సహాయపడుతాయి. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ బీన్స్‌ను త‌మ డైట్‌లో చేర్చుకుంటే బెట‌ర‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: