మన శరీరానికి బలం ఉండాలి అంటే పోషకాలు, విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. మన శరీరానికి ఖచ్చితంగా కావాల్సిన విటమిన్లలో డి విటమిన్ ఒకటి. ఉదయం లేదా సాయంకాలం ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుంది. 


 
ఆరోగ్య రక్షణలో విటమిన్ డి కు ఎంతో కీలక పాత్ర లభిస్తుంది. ఈ విటమిన్ డి ఎన్నో రకాల క్యాన్సర్ల నియంత్రణ, చికిత్సల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఎముకలు బలంగా ఉండాలి అంటే విటమిన్ డి తగినంత అందాల్సిందే. ఎన్నో రకాల క్యాన్సర్ ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషించే విటమిన్ డి పాత్ర ఎంత ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 


 
క్యాన్సర్.. ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న వ్యాధి ఇది. విటమిన్ డి తగిన మోతాదులో ఉన్న వారికి క్యాన్సర్ సోకే అవకాశం తక్కువని పరిశోధనల్లో తేలింది. 


 
విటమిన్ డి పురీషనాళ క్యాన్సర్ ను తగ్గిస్తుంది 


 
విటమిన్ 'డి'కి రొమ్ము క్యాన్సర్ ను తగ్గించే సామర్ధ్యం ఉందని కూడా పరిశోధనల్లో రుజువైంది. 


 
దీనిపై జరిపిన పరిశోధనలలో, కాల్షియం మరియు విటమిన్ 'డి' తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రభావాన్ని కట్టడి చేయొచ్చని పరిశోధనల్లో తెలిపింది. 


 
లంగ్ క్యాన్సర్ బాధితులు రోజూ విటమిన్ 'డి' ట్యాబ్లెట్స్ తీసుకుంటే వారి జీవితకాలం పెరుగుతుందని నిర్ధారణ అయింది. 
 


చూశారుగా విటమిన్ డి తో ఎన్ని లాభాలు ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయం, సాయంత్రం పూట ఒక అరగంట సేపు ఎండలో ఉంటే విటమిన్ డి అంది క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.                               

మరింత సమాచారం తెలుసుకోండి: