ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను కంటికి క‌నిపించ‌ని క‌రోనా ఎన్నో ఇబ్బందులు పెడుతుందో చూస్తేనే ఉన్నాం. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌.. దేశ‌దేశాలు వ్యాప్తిచెంది ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇర ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకి నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే  ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. 

 

ఇక ఆరోగ్య నిపుణులు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోమ‌నే సూచిస్తున్నారు. అయితే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచే ఆహారంలో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. వాస్త‌వానికి  జీడిపప్పు చాలా బలవర్థకమైన ఆహారం. మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్‌ జీడిపప్పులో ఉంటుంది. జీడిప‌ప్పు నుంచి జింక్, కాపర్, విటమిన్ కే, విటమిన్ ఏతో పాటు ఎర్ర, తెల్ల రక్త కణాల తయారీలో ఉపయోగపడే ఫొలేట్ కూడా లభిస్తుంది. జీడిపప్పులు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

 

అంతేకాకుండా.. జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్స్ అంటే సెలీనియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ఆక్సిడేషన్ ను నివారిస్తాయి, దాంతో క్యాన్సర్ రిస్క్ ను అరికడుతాయి. అలాగే జీడిపప్పులో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు మరియు పాలీశాచ్యురేటెడ్ కొవ్వులు రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ప్రతి రోజు గుప్పెడు జీడిపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మ‌రియు క‌రోనా బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌న‌ము ర‌క్షించుకోగ‌ల‌ము.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: