క్వారంటైన్ త‌ర‌లిస్తార‌ని భావించిన క‌రోనా పాజిటివ్గా నిర్ధార‌ణ అయిన బాలింత ఆస్ప‌త్రి నుంచి పారిపోయింది. ఈ సంఘ‌ట‌న పాత బ‌స్తీలో జ‌రిగింది. హైద‌రాబాద్ ప‌ట్ట‌ణంలోని హఫీజ్ బాబానగర్ కు చెందిన ఓమహిళ ఈ నెల 8న పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ హాస్పిటల్లో డెలివ‌రీ కోసం చేరింది. మ‌రుస‌టి రోజే వైద్యులు ఆప‌రేష‌న్ నిర్వ‌హించి కాన్పు చేశారు. పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. నాలుగు రోజుల కింద ఆమెకు దగ్గు, జలుబు మొదల‌వ‌డంతో డాక్ట‌ర్లు ఆమెను వేరే రూముకు షిఫ్టు చేసి శాంపిల్స్ సేకరించారు. అనంత‌రం ఆమె బ్ల‌డ్ శాంపిల్స్‌ను క‌రోనా ప‌రీక్ష‌ల‌కు పంప‌డారు. సోమవారం వ‌చ్చిన ఫ‌లితాల్లో ఆమెకు కరోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో గాంధీ హాస్పిటల్ కు పంపాలని డాక్ట‌ర్లు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు విష‌యం తెలిపారు. 

 

అయితే త‌న‌కు క‌రోనా లేకున్నా డాక్ట‌ర్లు కావాల‌నే  తప్పుగా చెబుతున్నార‌ని చెప్పి వారితో ఏకంగా గొడ‌వ‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. దీనిపై హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపే కుటుంబ సభ్యులు ఆ బాలింతను, బాబును తీసుకుని ఆస్ప‌త్రినుంచి వెళ్లిపోయారు. అయితే ఆస్ప‌త్రిలో న‌మోదు చేసిన అడ్ర‌స్‌లో కూడా వారు లేక‌పోవ‌డంతో ఇప్పుడు పోలీసులు వారిని వెతికి ప‌ట్టుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే ఆ మహిళకు ట్రీట్మెంట్ చేసిన ఐదుగురు డాక్ట‌ర్లు, ఐదుగురు నర్సు ల్లో ఆందోళన మొదలైంది. వారందరి నుంచి సోమవారం శాంపిల్స్ సేకరించారు. ఇక ఈ మహిళకు ట్రీట్మెంట్ చేసిన వార్డులోనే మరో పది మంది బాలింతలు కూడా ఉన్నట్టు సమాచారం.

 

వారంద‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వారంద‌రికి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఆస్ప‌త్రికి మిగ‌తావారినెవ‌రిని రానివ్వ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.హైద‌రాబాద్‌ను క‌రోనా అల్ల‌క‌ల్లొలం చేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ముంబైలో మొద‌ట్లో ఇలానే వంద‌ల్లో మొద‌లైన క‌రోనా కేసులు ఇప్పుడు అక్క‌డ విల‌యాన్ని సృష్టిస్తున్నాయి. గ‌డిచిన ప‌క్షం రోజుల‌ను గ‌మ‌నిస్తే కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా వృద్ధి చెందింది. నిత్యం ఇక్క‌డ‌కు 150కేసుల‌కు పైగానే న‌మోద‌వూతూ వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ఉన్న నాలుగైదు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ ప్రసూతి ఆస్పత్రి , ప్లేట్ బురుజు హాస్పిటల్ లో 32 మంది వైద్య సిబ్బందికి కరోనాపాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇందులో 18 మంది వైద్యులు, 14 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: