ఆంధ్రప్రదేశ్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.  రాష్ట్రంలో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన 4 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4307కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. 

 

 వైరస్‌బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ రోజు నమోదైన కేసులో రాష్ర్టానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన నలుగురు ఉన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఆదివారం కొత్త‌గా  అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47,  కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5,  గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66,విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి. 

 


 ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8929కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,451 నమూనాలు పరీక్షించగా 439 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కోరలు చాచుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల మార్క్ దాటింది. రోజు రోజుకీ కొత్త కేసుల నమోదులో రికార్డు సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 10 వేల పైబడే కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,413 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,10,461కు చేరింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: