చేప‌లు.. దాదాపు చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. చేపలను ఎలా చేసుకొని తిన్నా రుచిగానే ఉంటాయి. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. చేప మాంసం సులభంగా కూడా జీర్ణం అవుతుంది. ఇక చేపలను తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి మేలు చేకూరుతుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఆవశ్యక పోషకాలతో లోడ్ చేయబడి ఉండే చేప‌ల్లో.. ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలకు కూడా ఉంటాయి.

IHG

చేపలు తినడం వల్ల మన శరీరంలో అవయువాలకు లబ్ధి చేకూరుతుంది. చేప మాంసంలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులను నివారిస్తాయి. బిపిని తగ్గిస్తాయి. చేపలను ఆహారంగా తీసుకునేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటికి మంచిది. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అందుకే చేప‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, వర్షాకాలంలో చేపలు తినడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 

IHG'iidada Cunista Kaluunka – Shaqo Qaran

అవును! చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పోట్రీన్లు ఎక్కువగా ఉంటాయి. ఐతే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీంతో అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా.. వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ.. మలినాలు అంత సులభంగా తొలగిపోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే రిస్క్ ఎక్కువ‌గా ఉంది. వర్షాకాలంలో అపరిశుభ్ర చేపలను తింటే శ్వాస, హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. సో.. ఈ వ‌ర్షాకాలంలో చేప‌ల‌కు కాస్త దూరంగా ఉండ‌డంమే మంచిది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: