వంకాయ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా భార‌తీయులు వంకాయ‌ల‌తో అనేక ర‌కాల వంటలు త‌యారు చేస్తారు. వంకాయల‌‌తో ఎన్ని ర‌కాల వంట‌లు చేసినా.. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంద‌నే చెప్పాలి. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ వంకాయ సూప‌ర్ అంతే. అయితే ఎన్నో పోష‌కాలు ఉన్న వంకాయను కొంద‌రు మాత్రం తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అస‌లు దాన్ని ద‌గ్గిర‌కే రానివ్వ‌రు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలిస్తే.. ఖ‌చ్చితంగా వంకాయను తింటారు.

IHG

మ‌న‌కు విరివిరిగా ల‌భించే వంకాయలో విటమిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఒక ప్రభావవంతమైన యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంతో పాటు అనేక రోగాల‌తో పారాడేందుకు తోడ్ప‌తుంది. వంకాయల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు వీటిని తీసుకుంటూ ఉండాలి. త‌ద్వారా అధిక బ‌రువ‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే వంకాల్లో పీచుపదార్ధాలు అధికంగా ఉండటం వల్ల షుగర్ పేషంట్స్ ఇది తీసుకోవ‌డం చాలా మంచిది.

IHG

మ‌రియు వంకాయల్లో ఉండే పోలిఫినాల్స్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పుతో తింటే.. గాస్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి. అలాగే వంకాయ ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం వేళ‌లో తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔష‌ధం అని చెప్పుకోవ‌చ్చు. మ‌రియు వంకాయలలో ఖనిజాలు, విటమిన్లు, డైటరి ఫైబర్ సమృద్దిగా ఉండ‌డంతో పాటు అధిక నీరు కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మ‌రియు ప్ర‌కాశవంతంగా మారుస్తుంది. సో.. వంకాయ‌ల‌ను ఖ‌చ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి.

 
  
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: