మనిషి శరీరంలో ముఖ్యమైనది గుండె ..ఇది అందరికీ తెలిసిన విషయమే. మనిషి చనిపోయాడు అనుకున్న సమయంలో గుండె మీద బలంగా వైద్యులు తట్టడం వల్ల బ‌తికిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మనిషి శరీరంలో గుండె ఆధారం.మరి అటువంటి గుండెని ఎలా కాపాడుకోవాలి.మనకి తెలియని ఎన్నో విషయాల్ని  ఎంతో మంది శాస్తవేత్తలు పరిశోధనలు చేసి కొన్ని వాస్తవాలని బయట పెట్టారు అవి ఇప్పుడు మీకోసం..మీ ఆరోగ్య రక్షణ కోసం మీ ముందు ఉంచుతున్నాం.

Image result for heart care

సాధారణంగా గుండెకు జబ్బు ఎందుకు వస్తుంది..జబ్బు వస్తే ఎలా గుర్తించాలి అనే విషయాలు ఎవ్వరికి తెలియదు..ఇవి తెలుసుకున్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ...ఎక్కడికైనా నడుస్తూ వెళ్తుంటే ఆయాసం వచ్చినా సరే ..మీ గుండె మీద ఎదో తెలియని భారం పడినట్టే అని గుర్తిచండి.


అలా ఆయాసం వచ్చింది అంటే..మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.వైద్యులు చెప్పే జాగ్రత్తలు పాటించండి..కానీ మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే . గుండె పోటు రావడానికి కారణం మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ ఉండటం.కొలిస్ట్రాల్  ఎక్కువ అవడం అంటే గుండెకి రక్తాన్ని చేరవేయడానికి ఉండే నారాలలో కొవ్వు పేరుకు పోవడమే.ఈ కొవ్వు వల్ల‌ రక్తం గుండెకు సరిగా వెళ్లక గుండెకి హాని జరుగుతుంది.. తద్వారా గుండెపోటుకు దారితీస్తుంది.  

Related image

అందుకే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న పదార్ధాలు తీసుకోకూడదు.ముఖ్యంగా పెరుగు..చిక్కని పాలు..వెన్న..నెయ్యి..పాలని మరిగించగా వచ్చే పన్నీర్..ఇవన్నీ గుండె సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదు..అంతే కాదు మాంసం అధిక మోతాదులో తిన్నా సరే వారికి ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.మీ గుండె పదిలంగా ఉండాలి అంటే మీరు వీటికి దూరంగా ఉండక తప్పదు..అంతేకాదు డ్రైఫ్రూట్స్,  కాయగూరలు,ఆకు కూరలు మొలకెత్తిన గింజలు తీసుకోవడం వలన అలసిపోయిన మీ గుండెకి కొంత శక్తిని ఇచ్చినట్టుగా ఉంటుంది.

Image result for heart care

రోజు వారి మనం తినే ఆహారంలో వీటిని తప్పకుండ తీసుకోండి..అలాగే తిన్న తరువాత అటు ఇటు నడుస్తూ ఉంటే ఇంకా మంచిది..పొద్దునే లేచి యోగ చేసినా..లేక వ్యాయామం చేసినా..శరీరంలో రక్తప్రసరణ చాలా చురుకుగా జరుగుతూ..అన్నీ అవయవాలని ఉత్తేజపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: