మనిషి ఆరోగ్యానికి మించిన సంపద ఏది లేదు అంటారు..మనం సంపాదించేది కడుపు నిండా తినడానికి మరియు కంటి నిండా నిద్రపోవడానికి డబ్బు సపాదనలో ఆంతర్యం మాత్రం ఇదే..అయితే ఈ కాలంలో ఉన్న ఒత్తిడులకి తలొగ్గి జీవితం అంతా యాంత్రికంగా ఉండవలసి వస్తోంది..దీనివల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి..ముఖ్యంగా చాలా మంది తమ తమ పనులు అయ్యాక భోజనం చేస్తారు..కొంతమంది రాత్రి సమయంలో భోజనం చేసేసరికి సుమారు 10 దాటుతోంది...అలాంటివారు  

 Image result for effects of eating late night

రాత్రి భోజనం పది గంటల్లోపు తిఅడ,,తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అర్థరాత్రి పూట చిరుతిళ్లు తినడం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు, మధుమేహం సహా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అర్థరాత్రి తినడం వలన జీవక్రియలలో మార్పులు కలిగి... హార్మోన్లు ప్రతికూల ప్రభావం చూపడం వలన ఇన్సులిన్..కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినట్లు ఇప్పటికే పరిశోధనల్లోనూ వెల్లడి అయ్యింది. 

 Image result for effects of eating late night

రాత్రి పూట భోజనం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోపు తినేయడం మంచిదని చెప్తున్నారు మనకి పూర్వం ఇదే పద్దతిని పాటించేవారని..ఇప్పటికే అనేక గ్రామాలలో ప్రజలు సాయంత్రం 7 సమయంలో భోజనం చేసేసి 8 లేక 9 గంటల వ్యవధిలోనే పడుకోవడం వల్లనే గ్రామాలలో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని..వారిలో బరువు పెరిగే అవకాశం ఏమి ఉండదని చెప్తున్నారు..నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి  తగ్గిపోతుంది తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే తప్పని సరిగా సుమారు 8 గంటల నిద్ర మనిషికి అవసరం అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు


మరింత సమాచారం తెలుసుకోండి: