అధిక రక్త పీడనం వలన గుండెపోటు మరియు మూత్రపిండాల సమస్యలు కలుగుతాయి.బంగాళదుంప చిప్స్, పంది మాంసం, చల్లబరచిన చికెన్'లలో ఎక్కువగా ఉప్పు ఉంటుంది.సహజసిద్ధంగా లభించే పొటాషియంను ఎక్కువగా తినటానికి ప్రయత్నించండి.హైబిస్కస్ టీ మరియు గ్రీన్ టీ తాగే వారిలో రక్త పీడనం మామూలు స్థితిలో ఉంటుంది.

అధిక రక్తపోటు అనేది ఒక ప్రాణాంతకరమైనది మరియు ప్రతి ఏటా వీటి వలన చాలా మంది చనిపోతున్నారు. అధిక రక్త పీడనం గుండెపోటు కలగటం, కొన్ని సమయాల్లో మూత్రపిండాలని కూడా ప్రమాదానికి గురి చేస్తుంది. మీరు స్థూలకాయత్వాన్ని కలిగి ఉన్నట్లయితే శరీర బరువు తగ్గించుకోవాలి. పాటించే జీవనశైలిలో మార్పులను చేయటం వలన అధిక రక్తపీడనాన్ని తగ్గించవచ్చు.

వాకింగ్:

Image result for walking

రోజు నడవటం వలన రక్త పీడనం సాధారణ స్థితిలో ఉంటుంది. మీరు అధిక రక్త పీడనాన్ని కలిగి ఉన్నట్లయితే భౌతిక కార్యకలపాలను అనుసరించటం వలన గుండెకు ఆక్సిజన్ అందటం అధికం అవుతుంది. మీరు వారంలో కేవలం 4 నుండి 5 నిమిషాల పాటు గుండె పైన ప్రభావం చూపే పనులు చేయాలి; వీటి వలన రక్తపోటు సాధారణ స్థితిలోకి చేరటం మీరు గమనించవచ్చు. రోజు 15 నిమిషాల పాటు వ్యాయామాలని చేయటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆహరంలో ఉప్పు తగ్గించండి:

Image result for salt

మీ కుటుంబ చరిత్రలో రక్త పీడనం లేకున్నను ఉప్పు తక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. తీసుకునే ఆహారంలో అవసరమైతే తప్ప, ఒక చిటికెడు ఉప్పుని కూడా ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువ రుచికోసం ఉప్పుకి బదులుగా నిమ్మరసం, వెల్లుల్లి, మిరియాల వంటి ఔషద రుచులను కలపండి. ప్యాక్ చేసిన బంగాళదుంప చిప్స్, చల్లబరచిన చికెన్ సంబంధిత ఆహారపదార్థాలలో మరియు పంది మాంసాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కావున వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వీటితో పాటు క్రమం తప్పకుండా శరీరంలో సోడియం స్థాయిలను పరీక్షించుకోండి. 

ఆల్కహాల్'కి దూరంగా ఉండండి:

Image result for alcohol drinking

వారాంతపు సెలవు రోజులలో పరిమితికి మించిన ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీ రక్తపీడనం ప్రమాదకర స్థితికి చేరకూడదు అనుకుంటే ఆల్కహాల్'ని తక్కువగా స్థాయిలో తీసుకోవాలి. తక్కువగా ఆల్కహాల్'ని తీసుకోవటం వలన గుండెపోటు మరియు కరోనరీ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు. పరిమితి కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే వైద్యుడిని సంప్రదించి, కొద్ది కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవటం తగ్గించాలి. వరుసగా 4 లేదా 5 సార్లు ఆల్కహాల్ తీసుకోవటం వలన రక్తపీడనం వేగంగా మరియు అసామాన్యంగా పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

పొటాషియం:


పొటాషియం శరీరంలో ప్రతికూల చర్యలను కలుగచేస్తుంది; ఏది ఏమైనప్పటికీ, ఇది శరీరానికి కావలసిన మినరల్ మరియు సోడియానికి వ్యతిరేఖంగా ఉంటుంది. కావున మీరు తీసుకునే ఆహరంలో సోడియానికి బదులుగా పోటాషియంను వాడటం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధంగా ఎక్కువ పొటాషియంను కలిగి ఉన్న పండ్లని తినండి. మీరు ఎక్కువగా తినే ఆహరంలో వీటిని కుడా చేర్చుకోవటం చాలా మంచిది.

ఒక కప్పు టీ:

Image result for cup tea

ఔషదాలతో తయారు చేసిన టీలు ఆరోగ్యానికి చాలా మంచివి, రోజు హైబిస్కస్ టీ తాగేవారిలో రక్తపీడనం సాధారణ స్థితిలో ఉంటుంది అని పుస్తకాలలో ప్రచూరించబడింది. కాఫీ తాగటం వలన రక్తపీడనం కూడా ప్రభావానికి గురవుతుంది. కావాలంటే మీరు కాఫీ తాగుతూ రక్తపీడనాన్ని ప్రతి 30 నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకోండి, మీ రక్త పీడనం పెరగటం మీరు గమనిస్తారు. కావున హైబిస్కస్ మరియు గ్రీన్ టీలను తాగటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: