నిద్రించేటప్పుడు ఎవరి గొంతులో నుంచైనా హై పిచ్‌లో గురక సౌండ్ వినిపిస్తుంటే ఆ సౌండ్ దెబ్బకు పక్కనున్న వారికి నిద్రపట్టదు. నిజంగా గురక పెట్టేవారికి దాని గురించి తెలియదు కానీ పక్క వారికే గురక ఇబ్బంది తెలుస్తుంది. 


అయితే సాధారణంగా ఎవరికైనా గురక సమస్య అనేది వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ కింద ఇచ్చిన పలు టిప్స్ పాటిస్తే గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటంటే...


 1. విండ్‌పైపులో మ్యూకస్ పేరుకుపోవడం వల్ల సాధారణంగా ఎవరికైనా గురక వస్తుంది. అయితే దీన్ని పోగొట్టాలంటే వేడి ద్రవాలు తాగాలి. దీంతో మ్యూకస్ కరిగిపోతుంది. గాలి సరఫరాకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అయితే నిద్రించడానికి ముందు వేడి ద్రవాలను తాగాల్సి ఉంటుంది. హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటివి తాగితే మంచిది. 


 2. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలను కలిపి తీసుకోవాలి. దీంతో గురక సమస్య తగ్గుతుంది. 
 
3. పొగ తాగడం, మద్యం సేవించడం మానేయాలి. ఇవి శ్వాసకోశ సమస్యలను తెచ్చి పెడతాయి. ఫలితంగా గురక వస్తుంది. ఈ అలవాట్లను మానేస్తే గురక రాకుండా చూసుకోవచ్చు. 


 4. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. అప్పుడు వచ్చే నీటి ఆవిరిని పీల్చాలి. దీంతో శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి బాగా ఆడుతుంది. గురక తగ్గుతుంది. 
 
5. రాత్రి పూట భోజనంలో పచ్చి ఉల్లిపాయను తినాలి. దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లను పోగొడుతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో గురక సమస్య పోతుంది. 
 
6. కొద్దిగా ఆవనూనె తీసుకుని వేడి చేయాలి. అందులో కొంత కర్పూరం వేసి కరిగే వరకు తిప్పాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని రోజుకు 3 పూటలా ఛాతిపై రాసి మర్దనా చేయాలి. కనీసం 15 నిమిషాల పాటు మసాజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో రక్త సరఫరా పెరుగుతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు పోయి గురక తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: